MBNR: ప్రజల చెంతకే పాలన అందించడమే లక్ష్యమని మేయర్ మమత శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇవాళ కమిషనర్ రామానుజుల రెడ్డితో కలిసి పలు కాలనీల్లో పర్యటించి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. డ్రైనేజీ, వీధిదీపాలు, తాగునీటి సమస్యలను గుర్తించి, వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని సూచించారు.