AP: నంద్యాల జిల్లా బుడగ జంగాల కాలనీలో ఫుడ్పాయిజన్ తీవ్రత పెరుగుతోంది. తాజాగా మరో 20 మంది అస్వస్థతకు గురికావడంతో మొత్తం బాధితుల సంఖ్య 80కి చేరుకుంది. బాధితులందరినీ వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాగునీరు కలుషితం కావడం వల్లే ఇలా జరిగిందని అనుమానిస్తున్న మున్సిపల్ అధికారులు, నీటి స్వచ్ఛతను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.