MLG: జిల్లాలో యాసంగి రైతు భరోసా నిధుల మొదటి విడత విడుదలైనట్లు జిల్లా కలెక్టర్ దివాకర్ తెలిపారు. 79,040 మంది రైతుల ఖాతాల్లోకి మొత్తం రూ.40,98,59,892 జమైనట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో మొత్తం 1.80 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా 88,138 మంది రైతులు పట్టాలు పొంది ఉన్నారు. మిగతా రైతులకు ఈ నెల 25 తర్వాత రెండో విడత నిధులు విడుదలవుతాయని తెలిపారు.