ADB: ఏప్రిల్ 14న ఇంద్రవెల్లి మండల కేంద్రంలో జరిగే రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని DCC అధ్యక్షుడు నరేశ్ జాదవ్ పిలుపు నిచ్చారు. ఇవాళ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ సభ్యులతో కలిసి వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం కృషి చేయాలని కోరారు.