W.G: పాలకోడేరు మండలం, శృంగవృక్షం మేజర్ పంచాయతీలోని బంటుమిల్లి ప్రాంతంలో మంగళవారం ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు పర్యటించారు. ఈ సందర్భంగా కెనరా బ్యాంకు, గ్రామ పంచాయితీ నిధులతో ఏర్పాటు చేసిన 0.5 MLD మైక్రో ఫిల్టర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.