శ్రీకాకుళం: నరసన్నపేట మండలం తామరపల్లి రహదారిలో మంగళవారం కోటబొమ్మాళి నుంచి కళాశాల విద్యార్థులతో వస్తున్న ఆటో, ఓ స్కూల్ బస్సు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు గాయాలపాలయ్యారు. గాయపడిన వారిని 108లో ఏరియా హాస్పిటల్కు తరలించారు. పోలీసులు ఈ ఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపడుతున్నారు.