TG: GHMC అభివృద్ధికి రూ.15 వేల కోట్ల నిధులు మంజూరు చేశామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రూ.122 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని MLAలు చెప్పారని అన్నారు. 2016లో SRDPని తీసుకువచ్చారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలు పెట్టిన పనులకు తాము నిధులు మంజూరు చేశామన్నారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు చేస్తున్నామని తలసాని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.