SRD: కంగ్టిలోని నేతాజీ సర్కిల్లో మంగళవారం హైమాస్ట్ లైట్లు ఏర్పరిచారు. గత కొంతకాలం నుంచి స్థానికంగా హైమాస్ట్ లైట్లు వెలగక స్థానిక కూడలి చీకటితో ఉంది. విషయాన్ని గుర్తించిన సర్పంచ్ కృష్ణ ముదిరాజ్ లైట్లు బిగించేందుకు చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ఖేడ్ రోడ్డు, దెగులవాడి రోడ్డులో డివైడర్ మధ్య ఉన్న బట్టర్ ఫ్లై స్తంభాలకు కొత్త బల్బులను అమర్చారు.