NDL: నంద్యాల వైయస్సార్ నగర్ బుడగ జంగాల కాలనీలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై మంత్రి ఎన్ ఎండీ ఫరూక్ ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకుని, బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు.