TG: మంత్రి శ్రీధర్ బాబుపై ఎమ్మెల్యే మల్లారెడ్డి సెటైరికల్ విమర్శలు చేశారు. ‘శ్రీధర్ బాబు వల్ల ఇబ్బందిగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ చెత్తంతా జవహర్‌నగర్‌లో వేస్తున్నారు. ప్రజలు ఎంతో బాధ పడుతున్నారు. నేను అక్కడ ఉండలేకపోతున్నా. బాధను నా గుండె తట్టుకోలేకపోతోంది. స్పెషల్ కేటగిరీ కింద అభివృద్ది చేయాలి’ అని వ్యాఖ్యానించారు.