ADB: జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి క్రీడల్లో రాణించడం హర్షనీయం అని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రెండో ఎడిషన్ CM కప్ క్రీడా పోటీలలో జిల్లా అద్భుత ప్రతిభ కనబరిచి ఓవరాల్ ఛాంపియన్గా నిలిచింది. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశం మందిరంలో క్రీడాకారులను అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.