RR: మొయినాబాద్ డ్రగ్స్ కేసు నిందితులను నేడు కస్టడీకి తీసుకోనున్నారు. 3 రోజుల కస్టడీకి ఉప్పరపల్లి కోర్టు అనుమతిచ్చిన నేపథ్యంలో నేడు చంచల్గూడ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, రితేశ్, నమిత్ శర్మలను కస్టడీకి తీసుకోనున్నారు. అనంతరం డ్రగ్స్ మూలాలపై సిట్ విచారణ చేపట్టనుంది. విచారణలో మరికొందరి పేర్లు బయటికి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.