కృష్ణా: మచిలీపట్నంలోని కలెక్టరేట్లో విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో పరిశుభ్రత, పారిశుధ్యం పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బాలాజి అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దాలన్నారు.