TG: రాజీనామాపై ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని మాజీ మంత్రి జీవన్ రెడ్డి తేల్చి చెప్పారు. ‘పార్టీ మారొద్దని PCC నాతో చెప్పారు. PCC చీఫ్ ఎలాంటి హామీ ఇవ్వలేదు. నేను ఏ డిమాండ్లు PCC ముందు పెట్టలేదు. నా సమస్యకు పరిష్కారం ఆయన దగ్గర లేదు. 4 దశాబ్దాల అనుబంధం వదులుకోవడం బాధగా ఉన్నా తప్పడం లేదు. నాతో పాటు ఎంతమంది రాజీనామా చేస్తారో రేపు తేలుతుంది’ అని వ్యాఖ్యానించారు.