NLR: కలగిరిలోని ఏపీ మోడల్ స్కూల్లో ఇవాళ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరగనుంది. ఈ మేళాలో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొని, 18 నుంచి 36 ఏళ్ల మధ్య వయస్సు ఉండి, టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ చదివిన వారికి సుమారు 1,000 పైగా ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.