కృష్ణా: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పెంచాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. మంగళవారం చల్లపల్లిలో ఎన్.హెచ్-216 పక్కన చల్లని వాతావరణం కల్పించేందుకు స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమంలో భాగంగా చింత మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సజ్జా చలపతిరావు, మంగళాపురం సర్పంచ్ డొక్కు నాగేశ్వరరావు, డాక్టర్ డీ.ఆర్.కే.ప్రసాద్, డ్రైనేజీ డీఈఈ బాబూ నాయక్ పాల్గొన్నారు.