NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి మాత ఆలయ ఉత్సవాలు భాగంగా చైత్రమాస మంగళవారం అమ్మవారు శోభాయమానంగా దర్శనమిచ్చారు. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి, ఛైర్మన్ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు అమ్మవారికి విశేష ద్రవ్యాలతో అభిషేకం కుంకుమార్చన ,పుష్పాలంకరణ ,నిర్వహించారు. నైవేద్యాల సమర్పణ ,అనంతరం మహా మంగళహారతి, ఇచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.