ఆదిలాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అఖిల్ మహాజన్ను తంతోలి గ్రామస్థులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. శాంతి భద్రతలను కాపాడడంతో పాటు, జిల్లాను మరింత అభివృద్ధి పథంలో నడిపించాలని వారు కోరారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి సర్పంచులు తమ వంతు కృషి చేయాలని సూచించారు.