కోనసీమ: అయినవిల్లి మండలంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. అయినవిల్లి లంక గ్రామంలో సోమవారం సాయంత్రం ఏడేళ్ల బాలుడు సాత్విక్పై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయ పరిచాయి. వెంటనే కుటుంబ సభ్యులు అమలాపురం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వీటిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.