KDP: తాడేపల్లిగూడెం డీఎస్ చెరువు వద్ద ఉన్న బీవీఆర్ కళాకేంద్రంలో వ్యవస్థాపకులు బుద్దాల వెంకట రామారావు ఆధ్వర్యంలో 33 వ జాతీయ స్థాయి నాటిక పోటీలు సోమవారం అర్ధరాత్రి వరకూ జరిగాయి. దీనిలో భాగంగా నాలుగో రోజు మొదటి నాటికగా ప్రదర్శించిన ‘ఇది అతని సంతకం’ నాటిక’ తొలిరోజు విజేతగా ప్రకటించారు. ఈ నాటిక ప్రజలకు ఎంతో నచ్చినట్లు పేర్కొన్నారు. ఇవాళ చాలా నాటికలు ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.