నంద్యాల: వైయస్ నగర్లో ఫుడ్ పాయిజన్ ఘటన ఇవాళ కలకలం రేపింది. సుమారు 50 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి వెంటనే స్పందించి పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఘటనకు గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.