KDP: బద్వేలులోని రైతుబజారులో కూరగాయల స్టాల్స్ పెట్టుకునేందుకు నియోజకవర్గ రైతులు, డ్వాక్రా సంఘాల మహిళలు దరఖాస్తు చేసుకోవాలని మార్కెట్ యార్డ్ ఛైర్మన్ సుప్రజ కోరారు. స్థానిక మార్కెట్ యార్డ్లో సోమవారం ఆమె మాట్లాడుతూ.. దరఖాస్తు ఫారాలు మార్కెట్ యార్డ్లో అందుబాటులో ఉన్నాయన్నారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల రైతులు, డ్వాక్రా సంఘాల వారు అర్హులన్నారు.