NLG: జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రరూపం దాల్చింది. నిన్నటి వరకు గ్యాస్ కోసం ఇబ్బందులు పడ్డ సామాన్యులు, ఇప్పుడు వాహనాల్లో ఇంధనం కోసం బంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. జిల్లాకు రోజుకు సుమారు 10 లక్షల లీటర్ల పెట్రోల్, 20 లక్షల లీటర్ల డీజిల్ అవసరం కాగా, గత రెండు రోజులుగా సరఫరా భారీగా తగ్గిపోయింది. దాదాపు 500 బంకులు స్టాక్ లేక మూత పడినట్లు సమాచారం.