దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఇది 210 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైనట్లు జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం తెలిపింది. తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, సముద్రం లోపల సంభవించడం వల్ల ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు ధృవీకరించారు. లోతైన భూకంపం కావడంతో సునామీ ముప్పు కూడా లేదని సమాచారం.