ELR: వేలేరుపాడు సీపీఐ కార్యాలయం నుంచి MRO కార్యాలయం వరకు సీపీఐ నేతలు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. NDA కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని జిల్లా కార్యవర్గ సభ్యులు పిట్టా ప్రసాద్ డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త పింఛన్లు ఇచ్చి, ఇల్లు లేని పేదవారికి పక్క ఇల్లు కట్టించి,పెదవాగు ప్రాజెక్టు నిర్మాణం వెంటనే చేపట్టాలని కోరారు.