BHPL: మహదేవపూర్ మండలం పెగడపల్లిలో రేపు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు CI వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా CI మాట్లాడుతూ.. డివిజన్ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆరోగ్యాన్ని తనిఖీ చేసుకోవాలని సీఐ వెంకటేశ్వర్లు సూచించారు. వైద్య శిబిరానికి వచ్చే ప్రజలు ఆధార్ కార్డు తీసుకొని రావాలన్నారు.