TG: మాజీ మంత్రి జీవన్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చర్చలు విఫలమయ్యాయి. రాజీనామా నిర్ణయంపై జీవన్ రెడ్డి వెనక్కి తగ్గలేదు. దీంతో జగిత్యాలలోని జీవన్ రెడ్డి ఇంటి నుంచి మహేష్, సచిన్ సావంత్, ఆది శ్రీనివాస్ వెళ్లిపోయారు. ఈ క్రమంలో రేపు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు జీవన్ రెడ్డి ప్రకటించారు.