MDK: తూప్రాన్ పట్టణ శివారులోని 44వ జాతీయ రహదారి బైపాస్‌లో ఆటో రిక్షా బోల్తాపడగా 13 మంది గాయపడ్డారు. మాసాయిపేట మండలంలోని పలు గ్రామాలకు చెందిన వ్యక్తులు ఓ సీడ్ కంపెనీలో పని చేసేందుకు ఆటోరిక్షాలో వెళ్తున్నారు. తూప్రాన్ బైపాస్‌లో ఆటో రిక్షా అదుపుతప్పి బోల్తాపడడంతో అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులు గాయపడ్డారు. తూప్రాన్ ఆసుపత్రిలో చికిత్స అందజేస్తున్నారు.