HYD: మెట్రో రైలు ప్రాజెక్టును ప్రభుత్వపరం చేసేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. ఎల్అండ్టీ నుంచి 100% వాటాను రూ.15,000 కోట్లకు కొనుగోలు చేసే ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం IRFC నుంచి రుణం తీసుకోనుంది. తొలిదశను స్వాధీనం చేసుకోవడం ద్వారా, రెండో దశలోని 162.5 కి.మీ మేర విస్తరణ పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.