CTR: పుంగనూరు పట్టణంలో మంగళవారం సందర్భంగా గ్రామ దేవత అయిన శ్రీ విరుపాక్షి మారెమ్మ నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు ఉదయాన్నే అమ్మవారి మూలవర్లను తల పంచామృతలతో పాటు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకించారు. అనంతరం పసుపు, కుంకుమ, కాటుకతో అమ్మవారిని నిజరూపంలో అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.