AP: అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఓ జూనియర్ కాలేజీ బాత్రూమ్లో ఎలుగుబంటి ప్రత్యక్షం కావడంతో కలకలం రేపింది. ఎలుగుబంటిని చూసిన విద్యార్థులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని, ఎలుగుబంటిని సురక్షితంగా బంధించారు. దీంతో కాలేజీ యాజమాన్యం, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.