SRD: జిల్లా కలెక్టర్ పి. ప్రవీణ్య పంచాయతీ రాజ్, క్రీడా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అంబేద్కర్ స్టేడియం (సంగారెడ్డి), నారాయణఖేడ్ స్టేడియం మరమ్మత్తు పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో క్రీడా మౌలిక సదుపాయాల మెరుగుదల ద్వారా యువతకు మెరుగైన అవకాశాలు కల్పించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.