ELR: ఏలూరు డీసీసీబీ కార్యాలయంలో అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు అధ్యక్షతన సోమవారం బోర్డు సమావేశం నిర్వహించారు. గత నిర్ణయాలు ఆమోదించి, ఆర్బీఐ మార్గదర్శకాలపై సమీక్షించారు. బ్యాంకులో జరిగిన మోసాలపై త్వరిత చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ప్రతి సొసైటీ భవనంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయాలని తీర్మానించారు.