MHBD: గంగారం మండలం కోమట్లగూడెం గ్రామంలోని శ్రీ కోదండ రామాలయ అభివృద్ధికి నూతన కార్యనిర్వాహక కమిటీని నేడు ఏకగ్రీవంగా ఎన్నిక చేసింది. నూతన కమిటీలో దుర్గం వేణు అధ్యక్షుడు, గొగ్గల దిలీప్ ఉపాధ్యక్షుడు, దుర్గం కృష్ణ సేటు ప్రధాన కార్యదర్శి, వీరగాని పవన్ కళ్యాణ్ సహాయ కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఆలయ పెద్దలు, గ్రామస్తులు నూతన సభ్యులను వారిని అభినందించారు.