AP: విదేశీ నిధులు పొందేందుకు ఆర్డీటీకి కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది. అనంతపురం జిల్లాలో ఈ సంస్థ పలు సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ఏడాది క్రితం FCRA అనుమతులను కేంద్రం నిలిపివేసింది. దీంతో కేంద్రానికి CM, మంత్రులు, MPలు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అనుమతులు మంజూరు చేసింది. దీంతో CM చంద్రబాబు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.