పెద్దపల్లి టాస్క్ రీజియన్ సెంటర్లో రేపు భారీ ఉద్యోగమేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. వివిధ రకాల సంస్థలు పాల్గొని అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తాయని తెలిపారు. కావున జిల్లాలోని అన్ని రకాల విద్యార్హతలు గల నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉదయం 10 గంటలకు సరైన ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు.