WNP: ఖిల్లాగణపురంలో చేపడుతున్న గణపసముద్రం జలాశయం పనులను ముంపు బాధితుల సంఘం, రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మునగ రైతుల ఖాతాలో డబ్బు జమ చేసిన అనంతరం పనులు చేపట్టాలని కోరారు.రైతులతో గ్రామంలోనే అధికారులు సమావేశం నిర్వహించి ఎంత నష్టపరిహారం ఇస్తున్న విషయం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమాచారంతో పోలీసులు వెళ్లి వారిని నచ్చజెప్పినా వినలేదు.