SRPT: నడిగూడెం మండల పరిధిలోని రత్నవరం ప్రాథమిక పాఠశాలకు గ్రామానికి చెందిన మండవ వెంకయ్య (రిటైర్డ్ ఎల్డీసీ) జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు నాగమణి రూ. 5 వేల విలువైన రెండు సీలింగ్ ఫ్యాన్లను విరాళంగా అందజేశారు. మంగళవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ దాట్ల నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రధానోపాధ్యాయులకు అందజేశారు.