NGKL: చారకొండ మండలం సిర్సనగండ్లలో సీతారామచంద్రస్వామి దేవాలయ అభివృద్ధికి రూ. 2 కోట్ల నిధులతో చేపట్టిన పనులను మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే వంశీకృష్ణ శనివారం ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. ఆలయాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్ది పర్యాటక ప్రాంతంగా మారుస్తామని హామీ ఇచ్చారు. భక్తుల సౌకర్యార్థం మరిన్ని వసతులు కల్పిస్తామన్నారు.