KDP: లింగాల (M) పార్నపల్లి సమీపంలో జూదం ఆడుతున్నారన్న సమాచారంతో ఇవాళ ఎస్సై జగదీశ్వర రెడ్డి సిబ్బందితో దాడులు చేశారు. ఈ దాడిలో నలుగురిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 4 మొబైల్ ఫోన్లు, రూ.14,300 నగదు, 52 పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గ్రామాలల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.