ASR: గంజాయి విక్రయాలు, సాగు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డుంబ్రిగూడ ఎస్ఐ ఎల్. సురేష్ హెచ్చరించారు. మండలంలోని లిమిటీపుట్టు గ్రామంలో మంగళవారం ఉదయం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. డ్రోన్ల సాయంతో పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఇళ్లన్నింటికీ వెళ్లి తనిఖీలు చేపట్టారు.