PLD: పిడుగురాళ్ల మెడికల్ కళాశాల 2026-27 విద్యాసంవత్సరం నుంచే అందుబాటులోకి రానుందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. ఈ క్రమంలో బుధవారం వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సౌరబ్ గౌర్ బృందం క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించనుంది. మే 31 నాటికి పనులు పూర్తి చేయాలని, ఇప్పటికే 100 ఎంబీబీఎస్ సీట్లు, 520 పోస్టుల భర్తీకి మంత్రి సత్యకుమార్ ఆదేశాలు ఇచ్చారు.