ATP: రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఇవాళ ఉదయం ఎలుగుబంటి హల్ చల్ చేసింది. ఉదయం వాకింగ్‌కు వచ్చిన యువకులు ఎలుగుబంటిని చూసి భయాందోళనకు గురయ్యారు. అధికారులకు సమాచారం చేరవేయడంతో హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని బోను ద్వారా పట్టుకునెందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.