AP: రాజధాని అమరావతిలో వరుస అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ మేరకు హోంమంత్రి వంగలపూడి అనిత విచారణకు ఆదేశించారు. ఇటీవల వెలగపూడి వద్ద L&T సంస్థకు చెందిన పైపులకు కొందరు వ్యక్తులు ఉద్దేశ్యపూర్వకంగా నిప్పు పెట్టారు. తాజాగా రాయపూడిలోని ముఖ్య కార్యదర్శుల బంగ్లాల వద్ద అగ్నిప్రమాదం జరిగింది. అయితే, ఇది ప్రమాదమా లేక కుట్ర కోణమా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.