TG: గురుకులాల్లో ప్రవేశాలకు నిర్వహించిన TGSET-2026 ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. మ.1:30 గంటలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫలితాలను విడుదల చేస్తారు. SC, ST, BC, జనరల్ గురుకులాల్లో 5వ తరగతితో పాటు 6 నుంచి 9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈ పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది 1,72,842 మంది విద్యార్థులు ఈ అర్హత పరీక్ష రాశారు. అధికారిక వెబ్సైట్లో ఫలితాలు చూసుకోవచ్చు.