• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు

NZB: మోపాల్ మండలం కులాస్‌పూర్‌లో బుధవారం పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. ఈ సందర్భంగా పశువైద్యాధికారి డాక్టర్ బాబురావు మాట్లాడుతూ.. గాలికుంటు వ్యాధి పశువులకు ప్రాణాంతకమని, ఇది గాలి, ఆహారం ద్వారా ఒకదాని నుంచి మరొకదానికి వేగంగా వ్యాపిస్తుందని తెలిపారు.

March 11, 2026 / 06:49 PM IST

సీఎంఆర్ డెలివరీలు సకాలంలో పూర్తి చేయాలి: కలెక్టర్

SRPT: 2025-26 రబీ సీజన్‌లో 4.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే లక్ష్యమని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. బుధవారం మిల్లర్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాత బకాయిలను వెంటనే చెల్లించి, జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపాలన్నారు. బ్యాంక్ గ్యారంటీ, అగ్రిమెంట్ సమర్పించిన వారికే ధాన్యం కేటాయిస్తామని తెలిపారు.

March 11, 2026 / 06:46 PM IST

జనగామలో నీటి ఎద్దడిపై ప్రత్యేక దృష్టి

KMR: బీబీపేటలోని జనగామలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టారు. వార్డుల్లో తాగునీటి ఇబ్బందులు కలగకుండా కొత్తగా బోర్లు తవ్వించి, వాటికి మోటార్లు అమర్చారు. దీనివల్ల గ్రామస్తులకు తాగునీటి సరఫరా మెరుగుపడుతుందని సర్పంచ్ శ్రీనివాస్ తెలిపారు. వేసవిలో ప్రజలకు నీటి కష్టాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

March 11, 2026 / 06:44 PM IST

ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయండి: కలెక్టర్

NGKL: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి, లబ్ధిదారులతో గృహ ప్రవేశాలు చేయించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఏఈలతో ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్ పనులు నిరంతరం పర్య వేక్షించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

March 11, 2026 / 06:40 PM IST

వివాహితపై అత్యాచారం.. నిందితులుఅరెస్ట్

MBNR: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద దింపుతామని నమ్మించి, ఓ వివాహితను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన నిందితులను జడ్చర్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ కమలాకర్ తెలిపారు. నిందితులను విచారిస్తున్నామని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు.

March 11, 2026 / 06:40 PM IST

రేపు ‘డయల్ యువర్ ఎస్పీ’.. కార్యక్రమం

NRPT: జిల్లాలో గురువారం ‘డయల్ యువర్ ఎస్పీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డాక్టర్ వినీత్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ప్రజలు 08506-281182 నంబర్‌కు ఫోన్ చేసి తమ సమస్యలను నేరుగా ఎస్పీకి వివరించవచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదులను చట్టప్రకారం త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన వెల్లడించారు.

March 11, 2026 / 06:40 PM IST

మాజీ సర్పంచ్‌కి మాతృవియోగం.. మాజీ ఎమ్మెల్యే నివాళి

BHPL: గణపురం మండలం అప్పయ్యపల్లి మాజీ సర్పంచ్ రామచంద్రారెడ్డి మాతృమూర్తి కమలమ్మ నేడు స్వర్గస్థులయ్యారు. విషయం తెలుసుకున్న మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి సాయంత్రం వారి నివాసానికి వెళ్లి ఆమె పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలియచేసారు.

March 11, 2026 / 06:40 PM IST

దేవాలయ భూమి కాపాడాలని ఎమ్మెల్యే వినతి

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన సుమారు 3.17 ఎకరాల ఎండోమెంట్స్ భూమిని రక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ మంత్రి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్‌లకు వినతి పత్రం అందజేశారు. సర్వే నంబర్ 1492లో ఉన్న ఈ భూమి ఎండోమెంట్స్ శాఖ పరిధిలో ఉందని ఎమ్మెల్యే తెలిపారు.

March 11, 2026 / 06:37 PM IST

‘విద్యార్థులు ప్రణాళిక ప్రకారం చదవాలి’

PDPL: ధర్మారం మండలం నంది మేడారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇవాళ ఎస్ఎస్సీ విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం వసంత, ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో, ప్రణాళిక ప్రకారం చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. విద్యార్థులు పాఠశాలతో వారికి గల అనుభవాలను పంచుకున్నారు

March 11, 2026 / 06:37 PM IST

రాబోయేది మళ్లీ బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే: మాజీ మంత్రి

NLG: మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే, కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఈ విష‌యం కాంగ్రెస్ పార్టీ నాయకులే అనుకుంటున్న‌రు’ అని అన్నారు. కాగా, బుధవారం దేవరకొండ పట్టణంలో చందంపేట మండలం నుంచి మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

March 11, 2026 / 06:36 PM IST

‘రాబోయేది బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే’

NLG: దేవరకొండ పట్టణంలో చందంపేట మండలం నుంచి మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య ఆధ్వర్యంలో ఇవాళ పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ ప్ర‌భుత్వ‌మే, కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఈ విష‌యం కాంగ్రెస్ పార్టీ నాయకులే అనుకుంటున్న‌రు’ అని అన్నారు.

March 11, 2026 / 06:36 PM IST

పాలకుర్తిలో పండిట్ దీనదయాళ్ ప్రశిక్షణ మహాభియాన్

JN: పాలకుర్తిలో బీజేపీ బుధవారం పండిట్ దీనదయాళ్ ఉపాద్యాయ ప్రశిక్షణ మహాభియాన్ కార్యక్రమన్ని నిర్వహించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. ప్రతీ కార్యకర్తకు శిక్షణ అవసరం అన్నారు. ప్రపంచంలో అతి పెద్ద పార్టీ అయిన బీజేపీలో కరుడు గట్టిన కార్యకర్తలు ఉన్నారు అని అన్నారు.

March 11, 2026 / 06:36 PM IST

బైపాస్ రోడ్డు పనులను పరిశీలించిన జగ్గారెడ్డి

SRD: సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహం నుంచి బసవేశ్వర విగ్రహం వరకు బైపాస్ రోడ్డు పనులు నాణ్యతగా చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సూచించారు. రోడ్డు పనులను బుధవారం ఆయన పరిశీలించారు. రోడ్డు పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ షఫీ అహ్మద్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జార్జి పాల్గొన్నారు.

March 11, 2026 / 06:36 PM IST

సర్పంచ్ అయుబ్‌ను సన్మానించిన మాజీ సీఎం కేసీఆర్

MHBD: చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి గ్రామ సర్పంచ్‌గా అయూబ్ పాషా ఇటీవల ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం ఆయనను ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్‌లో సన్మానించారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపి గత BRS ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. మాజీ MLA రెడ్యానాయక్, తదితరులున్నారు.

March 11, 2026 / 06:35 PM IST

ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రం అందజేత

WNP: కొత్తకోట మండలం వడ్డెవాట తండాకు చెందిన పాత్లావత్ ఠాగూర్ నాయక్‌కు ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే జీ.మధుసూదన్ రెడ్డి బుధవారం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు, సర్పంచ్ రాంలాల్ నాయక్ పాల్గొన్నారు.

March 11, 2026 / 06:35 PM IST