• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన ఎర్రబెల్లి స్వర్ణ

WGL: రాష్ట్ర కాంగ్రెస్ మహిళా నూతన అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ బుధవారం హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని వారు సూచించారు. స్వర్ణ మాట్లాడుతూ.. మహిళా క్షేత్రంలో పార్టీకి బలం చేకూర్చడం తన ప్రధాన లక్ష్యం అని అన్నారు.

March 11, 2026 / 06:34 PM IST

అభివృద్ధి పనులకు ఎంపీ నిధులు: మల్లేష్ గౌడ్

MDK: మెదక్ పార్లమెంట్ పరిధిలోని పలు అభివృద్ధి పనుల కోసం ఎంపీ రఘునందన్ రావు రూ.2.4 కోట్ల ఎంపీ లాడ్స్ నిధులు కేటాయించారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డమ్ మల్లేష్ గౌడ్ తెలిపారు. బుధవారం నర్సాపూర్‌లో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో అంగన్వాడీలు, మహిళా భవనాలు, పాఠశాల ప్రహరీ గోడలు, బోర్ల ఏర్పాటు కోసం ఈ నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు.

March 11, 2026 / 06:34 PM IST

‘తాగు నీటి స‌మ‌స్య ప‌రిష్క‌రిస్తాం’

ADB: వేస‌విలో ఆదిలాబాద్ ప్ర‌జ‌ల దాహార్తి తీర్చ‌డ‌మే మున్సిప‌ల్ పాల‌క మొద‌టి లక్ష్యమని ఛైర్‌ప‌ర్స‌న్ బండారి అనూష అన్నారు. బుధ‌వారం లాండ‌సాంగి పంప్ హౌజ్‌ను కౌన్సిలర్లతో కలిసి సంద‌ర్శించారు. నీటి స‌మ‌స్య విష‌యాన్ని జిల్లాకు వ‌చ్చిన‌ ఇంఛార్జ్ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లి త&zwnj...

March 11, 2026 / 06:33 PM IST

ప్రజాప్రతినిధులకు ఎస్టీయూ నాయకుల సన్మానం

SRPT: స్టేట్ టీచర్స్ యూనియన్(ఎస్టీయూ) నాయకులు మున్సిపల్ ఛైర్మన్ దొంతగాని శ్రీనివాస్, వైస్ ఛైర్మన్ మల్లికార్జున్‌లను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బంధం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పాలూరి అంజయ్య, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

March 11, 2026 / 06:33 PM IST

‘సింగరేణి ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలి’

MNCL: బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దాలని కార్మిక సంఘాల JAC నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు. రిటైర్డ్ కార్మికులు మందుల కోసం వెళితే బీజోన్ ఆసుపత్రికి రిఫర్ చేయడం అనివార్యం అయిపోయిందన్నారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన వైద్యం అందడం లేదన్నారు.

March 11, 2026 / 06:31 PM IST

‘మహిళా సాధికారతే కాంగ్రెస్ ప్రభుత్వాలు లక్ష్యం’

SRCL: మహిళ సాధికారిత కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే సత్యం అన్నారు. ప్రజాపాలన-ప్రగతి పాలనలో భాగంగా బోయినపల్లి మండలంలో శ్రీ ధరిత్రి, శ్రీ లక్ష్మీ తులసి గ్రామైక్య సంఘాల భావన నిర్మాణాలకు బుధవారం ఎమ్మెల్యే శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. మహిళ మరింత అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం తరపున తనవంతు కృషి చేస్తానన్నారు.

March 11, 2026 / 06:30 PM IST

కలెక్టర్‌తో మాజీ ఎమ్మెల్యే భేటీ

GDWL: జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన రిజ్వాన్ బాషా షేక్‌ను ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్‌లో ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రజా సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ దొడ్డప్ప, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

March 11, 2026 / 06:30 PM IST

ఈనెల 13న కాగజ్ నగర్ లో మినీ జాబ్ మేళా

ASF: కాగజ్ నగర్ పట్టణంలో ఈనెల 13న మినీ జాబ్ మేళ నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఏ రవికృష్ణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉదయం 10:35 గంటలకు జాబ్ మేళా ప్రారంభం అవుతుందన్నారు. ఆసక్తి గల అభ్యర్ధులు జాబ్ మేళలో పాల్గొనాలని సూచించారు. వివరాలకు 9392310323,798973351లో సంప్రదించాలన్నారు.

March 11, 2026 / 06:30 PM IST

రామన్నగూడెంలో పారిశుద్ధ కార్యక్రమాలు

MLG: 99 రోజుల ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా తాడ్వాయి మండలంలోని రామన్నగూడెం గ్రామంలో బుధవారం పారిశుద్ధ కార్యక్రమాన్ని చేపట్టారు. మంత్రి సీతక్క పిలుపు మేరకు గ్రామంలో ఉన్న డ్రైనేజీ, పూడికతీత పనులను చేపట్టారు. సర్పంచ్ గద్దల నవీన్ దగ్గరుండి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, సిబ్బందికి పలు సూచనలు చేశారు.

March 11, 2026 / 06:28 PM IST

గురుకుల బాలికల పాఠశాలలో వైద్య పరీక్షలు

KNR: చొప్పదండి సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాలలో బుధవారం (ఆర్ఎఎస్కె) హెల్త్ క్యాంపు నిర్వహించారు. డాక్టర్ నిశ్చల, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కీర్తన ఆధ్వర్యంలో PHC సిబ్బంది బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో మెనుస్ట్రువల్ హైజీన్, HPV వాక్సినేషన్, పోషకాహారం తీసుకోవడం, ఎనీమియాను ఎదుర్కొనే విధానాలు, పర్సనల్ హైజీన్ గురించి అవగాహన కల్పించారు.

March 11, 2026 / 06:28 PM IST

‘ఎస్జీటీలకు జనగణన విధులు కేటాయించాలి’

KMR: 2026లో జరగనున్న జనగణన విధుల్లో ఎస్జీటీ ఉపాధ్యాయులకు అవకాశం కల్పించాలని కోరుతూ ఎస్జీటీ యూనియన్ సభ్యులు బుధవారం బాన్సువాడ ఎంఈవో నాగేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. 2025 వేసవి సెలవుల్లో శిక్షణలో పాల్గొన్న వారికి ELS ప్రొసీడింగ్ ఇవ్వాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో విధులు నిర్వహించిన వారికి CCL మంజూరు చేయాలన్నారు.

March 11, 2026 / 06:25 PM IST

ఉప్పల్ ఏసీపీ వెంకట్ రెడ్డిని కలిసిన జర్నలిస్ట్

MDCL: ఉప్పల్ ఏసీపీ వెంకట్ రెడ్డిని ఎస్సీ–ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎల్లా సంతోష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఉప్పల్ పరిధిలోని పలు అంశాలను ఏసీపీ దృష్టికి తీసుకెళ్లగా, సమస్యలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

March 11, 2026 / 06:24 PM IST

విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారిన వేళ…

SDPT: చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు ప్రాథమిక పాఠశాలలో బుధవారం స్వపరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ప్రధానోపాధ్యాయులుగా హారిక, డీఈవోగా దీక్షిత్, ఎంఈవోగా యశ్వంత్ పలువురు విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనంద , ఉపాధ్యాయులు పర్యవేక్షించారు.

March 11, 2026 / 06:23 PM IST

నీరా కేఫ్ నిర్వహించడానికి టెండర్ల ఆహ్వానం

SRCL: హైదరాబాదులోని నీరా కేఫ్ 2 సంవత్సరాలు నిర్వహించడానికి టెండర్లను ఆహ్వానిస్తున్నామని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సౌజన్య తెలిపారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో మంగళవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. గీత కార్మికుల సంఘాల నుంచి ఈ టెండర్లను ఆహ్వానిస్తున్నామన్నారు. ఈనెల 18 నుంచి 28వ తేదీ వరకు సిరిసిల్లలోని కలెక్టరేట్లో ఈ బిడ్‌లో పాల్గొనాలన్నారు.

March 11, 2026 / 06:23 PM IST

అధిక వడ్డీ పేరుతో ప్రజలను మోసం చేసిన వ్యక్తి అరెస్టు

HNK: చిట్టీలు, అధికవడ్డీ ఆశ చూపిస్తూ ప్రజల నుంచి రూ.కోట్లు సేకరించి తిరిగి ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు. ACP సతీష్ బాబు వివరాల ప్రకారం.. కిషోర్ 2011 నుంచి ప్రభుత్వ అనుమతి లేకుండా చిట్ ఫండ్ నిర్వహిస్తూ ప్రజలనుంచి డబ్బులు సేకరించాడు. మొత్తం 117 మంది నుంచి రూ.1,49,22,000 తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసంచేయగా నేడు పట్టుబడ్డాడు.

March 11, 2026 / 06:21 PM IST