• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

రేపు ప్రజాప్రతినిధులకు అవగాహన సమావేశం

SRD: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమాన్ని కంది పరిధిలోని కన్వెన్షన్‌లో ఈనెల 12వ తేదీన నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య బుధవారం తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, గ్రామపంచాయతీ సర్పంచులు అవగాహన సమావేశంలో పాల్గొనాలన్నారు.

March 11, 2026 / 05:44 PM IST

రైతు వేదికలో అవగాహన సదస్సు

SRCL: భూసార పరీక్షల ఫలితాల ఆధారంగానే రసాయన ఎరువులు వాడాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ హరికృష్ణ సూచించారు. హన్మాజీపేట రైతు వేదికలో ఆత్మ (ATMA) ఆధ్వర్యంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. భూమి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే ఆయిల్ పామ్, ప్రకృతి వ్యవసాయం, కూరగాయల సాగుతో అధిక లాభాలు గడించవచ్చని హరికృష్ణ అన్నారు. AO వినీత రెడ్డి పాల్గొన్నారు.

March 11, 2026 / 05:42 PM IST

‘ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పాలన’

PDPL: ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాలన కొనసాగుతుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. ఇవాళ ఆయన పెద్దపల్లి ప్రజాప్రతినిధుల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఉపయోగపడే రోడ్లు, డ్రైనేజీలు, పారిశుద్ధ్య నిర్వహణ, చెట్ల పెంపకం మొదలగు పనులు చేపట్టాలని సూచించారు.

March 11, 2026 / 05:40 PM IST

తహసీల్దార్‌కు అరెస్టు వారెంట్..!

NLG: తిరుమలగిరి సాగర్ తహసీల్దార్ అనిల్‌కు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ షాక్ ఇచ్చింది. ఒక భూ వివాదంలో పక్షపాతంగా వ్యవహరించారంటూ బాధితుడు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించగా, దీనిపై నివేదిక ఇవ్వాలని గతంలోనే తహసీల్దార్‌ను ఆదేశించింది. అయితే కమిషన్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ నివేదిక సమర్పించకపోవడంతో ఆగ్రహించిన TGHRC, ఎమ్మార్వోకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

March 11, 2026 / 05:40 PM IST

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్య: కలెక్టర్

GDWL: ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో అనుభవజ్ఞులైన అధ్యాపకుల చేత నాణ్యమైన విద్య అందుతుంది అని గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో గద్వాల ప్రభుత్వ ఎంఏఎల్‌డీ డిగ్రీ కళాశాల నూతన ప్రవేశాల అవగాహన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. కళాశాలలో అందుబాటులో ఉన్న వివిధ కోర్సులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 11, 2026 / 05:40 PM IST

మాదకద్రవ్యాలను సమాజం నుంచి తరిమికొట్టాలి: డీఈవో

MBNR: జిల్లా కేంద్రంలోని మోడల్ బేసిక్ ప్రభుత్వ పాఠశాలలో జిల్లా స్థాయి ప్రహరీ క్లబ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీఈవో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని అన్నారు. అనంతరం ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ నరసింహారెడ్డి డ్రగ్స్‌పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

March 11, 2026 / 05:38 PM IST

రాయలాపూర్ పాఠశాలలో స్వయం పరిపాలన.

MDK: రామాయంపేట మండలం రాయలాపూర్ గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ‘స్వయం పరిపాలన దినోత్సవం’ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 5వ తరగతి విద్యార్థులు J. భానుప్రకాష్ (DEO), S. నరేష్ (MEO), కుమారస్వామి (కాంప్లెక్స్ HM), T. రాకేష్ (హెడ్ మాస్టర్)గా బాధ్యతలు స్వీకరించి అలరించారు. మిగతా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు.

March 11, 2026 / 05:38 PM IST

‘మట్టి పరీక్షల ఆధారంగా ఎరువులు వేసుకోవచ్చు’

SDPT: మట్టి పరీక్షలు ఆధారంగా పంటలకు సరిపడా ఎరువులు వేసుకోవచ్చని సిద్దిపేట ఏడీఏ పద్మ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలోభాగంగా చిన్నకోడూరు మండలం అల్లీపూర్‌లో బుధవారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతుల వ్యవసాయ క్షేత్రంలో మట్టి పరీక్ష నమూనాలు సేకరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు ఎరువులు, పురుగుల మందులు అధికంగా వాడటం వల్ల భూమి నిస్సారమవుతుందన్నారు.

March 11, 2026 / 05:38 PM IST

‘దేశాభివృద్ధికి జనగణనే దిక్సూచి’

ADB: దేశాభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు పకడ్బందీగా జరిగే జనగణనే దిక్సూచిగా ఉంటుందని ITDA PO యువరాజ్ మర్మాటే అన్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన భారత జనగణన–2027 శిక్షణ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ రాజేశ్వర్‌తో కలిసి ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో సేకరించే సమాచారం భవిష్యత్తు సంక్షేమ పథకాలకు ఆధారమవుతుందని పేర్కొన్నారు.

March 11, 2026 / 05:33 PM IST

‘ప్రభుత్వ యూనివర్సిటీలను కాపాడాలి’

HNK: ప్రభుత్వ యూనివర్సిటీలను కాపాడాలని, ప్రైవేటు యూనివర్సిటీలను వ్యతిరేకించాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ అన్నారు. ఈనెల 17,18వ తేదీలో పాలమూరు యూనివర్సిటీలో జరగబోయే యూనివర్సిటీల కన్వెన్షన్‌కు సంబంధించిన పోస్టర్లను నేడు కేయూలో నేతలతో కలిసి శ్రీకాంత్ ఆవిష్కరించారు.

March 11, 2026 / 05:31 PM IST

డిగ్రీ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

JN: జనగామలోని తెలంగాణ మైనారిటీ రెసిడెనిషియల్ స్కూల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెనిషియల్ (గర్ల్స్) డిగ్రీ కళాశాలను అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్బంగా కిచెన్, స్టాక్ రిజిస్టర్లు, స్టాఫ్ అటెండన్స్ రిజిస్టర్‌లను పరిశీలించారు. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా పెట్టుకోవాలని, నాణ్యమైన సరుకులనే వినియోగించాలన్నారు.

March 11, 2026 / 05:28 PM IST

ట్రాక్టర్ బోల్తా..ఒకరు మృతి

KMM: అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముదిగొండ మండలంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. పెద్దమండవ సమీపంలో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తాపడటంతో ఏపీకి చెందిన ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.

March 11, 2026 / 05:27 PM IST

‘విద్యతోపాటు వివిధ రకాల నైపుణ్యాలు ఎంతో ముఖ్యం’

KNR: ప్రస్తుత రోజుల్లో విద్యతో పాటు వివిధ రకాల నైపుణ్యాలు ఎంతో ముఖ్యమని, అప్పుడే ఉపాధి మార్గాలు లభిస్తాయని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా అన్నారు. శాతవాహన యూనివర్సిటీలో జరిగిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు “అకాడమిక్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం” కార్యక్రమానికి ఉన్నత విద్యాశాఖ కమిషనర్ దేవసేనా, కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి హాజరయ్యారు.

March 11, 2026 / 05:25 PM IST

‘గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలి’

MNCL: గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని గో సంరక్షణ సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జ్ సూర్యకాంత్ డిమాండ్ చేశారు. బుధవారం లక్షెట్టిపేట మండల కేంద్రంలో గో సంరక్షణ సమితి మండల ప్రముఖ్ అధ్యర్యంలో గో సంరక్షణ కోసం సమావేశం నిర్వహించారు. గోవధను నిషేధించాలని, గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఏప్రిల్ 27న తహసీల్దార్లకు వినతి పత్రాలను అందజేస్తామన్నారు.

March 11, 2026 / 05:18 PM IST

‘జనగణన విధులను పక్కగా నిర్వహించాలి’

NZB: జనగణన విధులను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. జిల్లా కలెక్టరేట్​లో బుధవారం సంబంధిత శాఖల అధికారులు, తహసీల్దార్లకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2011లో చివరిసారిగా జనాభా గణన జరిగిందని గుర్తు చేశారు. వాస్తవానికి 2021లో ఈ ప్రక్రియలు చేపట్టాల్సి ఉండగా.. కరోనా వల్ల నిర్వహించలేదన్నారు.

March 11, 2026 / 05:15 PM IST