ADB: దేశాభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు పకడ్బందీగా జరిగే జనగణనే దిక్సూచిగా ఉంటుందని ITDA PO యువరాజ్ మర్మాటే అన్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన భారత జనగణన–2027 శిక్షణ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ రాజేశ్వర్తో కలిసి ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో సేకరించే సమాచారం భవిష్యత్తు సంక్షేమ పథకాలకు ఆధారమవుతుందని పేర్కొన్నారు.