• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

311 మందికి ఇండ్ల పట్టాలు పంపిణీ

KMM: ఖమ్మం వెలుగుమట్లలో బాధితుల కోసం అద్భుతమైన ‘మోడల్ కాలనీ’ నిర్మిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్‌లో భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన 311 మంది బాధితులకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ ఉన్నారు.

March 11, 2026 / 06:19 PM IST

పీఏసీఎస్ మాజీ ఛైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

NLG: నకిరేకల్ పీఏసీఎస్ మాజీ ఛైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు జన్మదినం సందర్భంగా.. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శుభాకాంక్షలు తెలిపారు. గురువారం నకిరేకల్‌లోని తన నివాసంలో వెంకటేశ్వర్లును శాలువాతో సత్కరించి, మిఠాయి తినిపించి అభినందించారు. కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.

March 11, 2026 / 06:18 PM IST

ఉపాధి హామీ బకాయిలు చెల్లించాలని వినతి

SRD: ఉపాధి హామీ కూలీలకు చెల్లించాల్సిన మూడు నెలల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో ఉపాధి హామీ ఏపీడీకి సంగారెడ్డిలో బుధవారం వినతి పత్రం సమర్పించారు. జిల్లా కార్యదర్శి జయరాజు మాట్లాడుతూ.. మూడు నెలల నుంచి కూలీలకు బకాయిలు చెల్లించకపోవడం సరికాదని పేర్కొన్నారు. బకాయిలు చెల్లించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

March 11, 2026 / 06:15 PM IST

హైదరాబాద్‌లో జిల్లా వాసి మృతి

NLG: చింతపల్లి మండలం మదనపురానికి చెందిన పల్లెపు రాణి(40) హైదరాబాద్ వనస్థలిపురంలో మరణించింది. ఆమె గర్భసంచి ఆపరేషన్‌కు ఓ హాస్పటల్‌కు వెళ్తే ఆపరేషన్ చేయగా.. వైద్యుల నిర్లక్ష్యంతో చనిపోయిందని మృతురాలి తల్లి ఆరోపించింది. తర్వాత మరో హాస్పిటల్‌కు తరలించారని తెలిపింది. మృతురాలికి కొడుకు(21), కూతురు(19) ఉన్నారు. భర్త కొన్ని ఏళ్ల క్రితం చనిపోయాడు.

March 11, 2026 / 06:09 PM IST

సాధు సమ్మేళనంలో పాల్గొన్న MLA

ADB: నేరడిగొండ మండల కేంద్రంలో సాధు సమ్మేళన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో బోథ్ MLA అనిల్ జాదవ్ పాల్గొని గ్రామస్తులు కలిసి ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు. సమాజంలో సత్ప్రవర్తన తీసుకురావడానికి శ్రీ శివానంద స్వామి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ధర్మాన్ని రక్షించుటకై ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

March 11, 2026 / 06:08 PM IST

పోలీసుల సంక్షేమమే మా ప్రాధాన్యం: ఎస్పీ

GDWL: జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు బుధవారం ఆర్ముడ్ రిజర్వ్ (AR) పోలీసులతో ‘పోలీస్ దర్బార్’ నిర్వహించారు. సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తామని, వారి వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఎస్పీ హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణను పాటిస్తూనే.. నిత్యం వ్యాయామం, యోగా ద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సిబ్బందికి సూచించారు. 

March 11, 2026 / 06:05 PM IST

కడెం తహసీల్దార్‌గా లచ్చిరాం బాధ్యతల శ్వీకరణ

NRML: కడెం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న లచ్చిరాంకు తహసీల్దార్‌గా బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బుధవారం కార్యాలయ సిబ్బంది ఆయనను ఘనంగా శాలువలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శారదా, సిబ్బంది ఉన్నారు.

March 11, 2026 / 06:05 PM IST

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టీకాలు

NGKL: అవుసలికుంట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం విద్యార్థులకు ఇమ్యునైజేషన్ టీకాలు వేశారు. అంబటిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో.. కోరింత దగ్గు, ధనుర్వాతం వంటి వ్యాధులు రాకుండా టీకాలు వేస్తున్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోడావత్ మంగమ్మ, పాఠశాల ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

March 11, 2026 / 06:03 PM IST

గ్రామాల్లో పారిశుధ్య పనులు ముమ్మరం..!

NZB: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా పలు గ్రామాల్లో పారిశుధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. లక్కోర, అమీనాపూర్, జానకంపేట, సాహెబ్పేట్, మోతే, పోచంపల్లి గ్రామాల్లో మినీ ట్యాంకులను శుభ్రం చేశారు. అంకుసాపూర్‌లో వాటర్ ట్యాంకుల క్లోరినేషన్ చేపట్టి, మోరీలను క్లీన్ చేయించారు.

March 11, 2026 / 05:56 PM IST

పార్టీ కోసం పనిచేసే వారందరికీ పదవులు తప్పనిసరి: ఎమ్మెల్యే

WNP: పార్టీ పదవులు, నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రశాంత ప్రతినిధులుగా ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ పదవి బాధ్యతలో ఉంటారని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం రేవల్లి మండలంలో నిర్వహించిన కమిటీ ఎన్నిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి ఒక్కరికి పదవులు దక్కుతాయని తెలిపారు.

March 11, 2026 / 05:54 PM IST

అప్పిరెడ్డిపల్లి పాఠశాలలో స్వయం పరిపాలన

JN: దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామంలోని ఉన్నత పాఠశాలలో బుధవారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా, అధికారులుగా మారి పాఠశాల బాధ్యతలను భుజానకెత్తుకున్నారు. జిల్లా విద్యాధికారి, ప్రధానోపాధ్యాయుల పాత్రల్లో విద్యార్థులు ఒదిగిపోయి విధులను నిర్వర్తించారు. పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు తదితరులున్నారు.

March 11, 2026 / 05:53 PM IST

‘రంజాన్ ఏర్పాట్లలో లోపాలు ఉండొద్దు’

SRPT: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈద్గా వద్ద మున్సిపల్ కమిషనర్ హనుమంత రెడ్డి, వైస్ ఛైర్మన్ షఫీ ఉల్లా బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు. సూర్యాపేటలో ముస్లిం సోదరుల ప్రార్థనలకు ఆటంకం కలగకుండా పారిశుధ్య పనులు, తాగునీరు, విద్యుత్ దీపాల ఏర్పాటుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పట్టణంలోని మసీదుల పరిసరాలను శుభ్రంగా ఉంచాలని అన్నారు.

March 11, 2026 / 05:50 PM IST

సాగునీటి సమస్య పరిష్కారానికి కృషి: మంత్రి

జగిత్యాల జిల్లాలో సాగునీటి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సాగునీటి సమస్యలకు కృషి చేస్తానని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గిరిజన సంక్షేమ మంత్రిగా జిల్లాలో అన్ని గిరిజన గ్రామాలు, తండాలకు రవాణా సౌకర్యం కోసం నిధుల మంజూరుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తానని తెలిపారు.

March 11, 2026 / 05:46 PM IST

నిబంధనలు పాటించని మద్యం దుకాణాలు

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌లో నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నారని స్వచ్ఛంద పౌర సేవా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు మల్లయ్య, మధుసూదన్ రావు అన్నారు. బుధవారం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. విచ్చలవిడిగా పర్మిట్ రూములు ఏర్పాటు చేశారని, బెల్ట్ షాపుల్లో నిరంతరం మద్యం అమ్మకాలు చేస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

March 11, 2026 / 05:44 PM IST

సైడ్ డ్రైన్, సిమెంట్ రోడ్డు నిర్మాణానికి MLA శంకుస్థాపన

ASF: సిర్పూర్ టౌన్‌లోని బెంగాలీ క్యాంపులో NREGS కింద మంజూరైన సైడ్ డ్రైన్, సిమెంట్ రోడ్డు నిర్మాణానికి MLA డా. పాల్వాయి హరీష్ బాబు బుధవారం శంకుస్థాపన చేశారు. MLA మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకమైన జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు నిర్మిస్తున్నామని తెలిపారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.

March 11, 2026 / 05:44 PM IST